హాలిడేకి అదరగొట్టిన “హను మాన్” వసూళ్లు.!

హాలిడేకి అదరగొట్టిన “హను మాన్” వసూళ్లు.!

Published on Jan 27, 2024 10:01 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సాలిడ్ సూపర్ హీరో హిట్ చిత్రం “హను మాన్”. మరి భారీ అంచనాలు నడుమ వచ్చి వాటిని అన్నిటికన్నా మించి రీచ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ఇక నిన్న రిపబ్లిక్ డే హాలిడే ని అయితే తెలుగు రాష్ట్రాల్లో హను మాన్ బాగా క్యాష్ చేసుకుంది అని తెలిసిందే.

సాలిడ్ బుకింగ్స్ తో సాలిడ్ జంప్ ని అందుకోగా ఈ 15వ రోజు అయితే ఒక్క తెలుగు స్టేట్స్ లోనే ఐదున్నర కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది మాసివ్ నెంబర్ అని చెప్పాలి. దీనితో నిన్న ఒక్కరోజే ఈ చిత్రం ఈజీగా 2 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఇక ఈరోజు శనివారం రేపు ఆదివారం కూడా మరోసారి “హను మాన్” మరింత స్ట్రాంగ్ వసూళ్లు రాబడుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి గౌర హరీష్ సంగీతం అందించగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు