సంక్రాంతి కి రిలీజై ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన “హను మాన్”

సంక్రాంతి కి రిలీజై ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన “హను మాన్”

Published on Jan 30, 2024 2:30 PM IST


టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది ఈ సినిమా. హను మాన్ మూవీ సంక్రాంతి పండుగ కి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకూ సంక్రాంతి పండుగ బరిలో నిలిచిన సినిమాల్లో హను మాన్ 265 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇకపై రిలీజై అన్ని చిత్రాలకి టార్గెట్ ను సెట్ చేయడం జరిగింది.

అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు