25 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న “హను మాన్”

25 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న “హను మాన్”

Published on Apr 22, 2024 3:46 PM IST


టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్ (Hanuman). ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం తాజాగా 25 సెంటార్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థియేటర్ల లో, డిజిటల్ గా సూపర్ రెస్పాన్స్ ను కొల్లగొట్టిన ఈ చిత్రం, ఈ 28 వ తేదీన జీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు