హను మాన్: 300 కేంద్రాల్లో 30 రోజులు!

హను మాన్: 300 కేంద్రాల్లో 30 రోజులు!

Published on Feb 11, 2024 8:08 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా 300 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. తాజాగా ఈ చిత్రం మరొక రికార్డ్ ను సొంతం చేసుకుంది. 300 కేంద్రాల్లో 30 రోజులు పూర్తి చేసుకుంది. ఇది ఒక విధంగా సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి.

చాలా చిత్రాలు 2-3 వారాలకే బాక్సాఫీస్ వద్ద పరిమితం అవుతుంటే, హను మాన్ మాత్రం లాంగ్ రన్ ను కొనసాగిస్తోంది. అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు