హిందీ బాక్సాఫీస్ వద్ద “హను మాన్” సెన్సేషన్!

హిందీ బాక్సాఫీస్ వద్ద “హను మాన్” సెన్సేషన్!

Published on Jan 23, 2024 5:11 PM IST


టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం హిందీ లో కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. నిన్న ఈ సినిమా 2.30 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. దీంతో ఈ సినిమా ఇప్పటి వరకూ 36.54 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ జనవరి 25 న హిందీ లో ఫైటర్ రిలీజ్ కానుంది.

ఫైటర్ కి హను మాన్ ఎలాంటి పోటీ ఇస్తుంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారుతోంది. నార్త్ ఇండియా లో హను మాన్ తెలుగు వెర్షన్ ఇప్పటి వరకూ 2.26 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు