హిందీ లో 50 కోట్ల క్లబ్ దిశగా “హను మాన్”

హిందీ లో 50 కోట్ల క్లబ్ దిశగా “హను మాన్”

Published on Jan 28, 2024 2:34 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం చిన్న సినిమాగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. భారీ విజయాన్ని నమోదు చేసుకొని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం నిన్న మరో 1.40 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. దీంతో ఈ సినిమా ఇప్పటి వరకూ హిందీలో 42.84 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 50 కోట్ల క్లబ్ దిశగా అడుగులు వేస్తోంది.

నార్త్ ఇండియా లో తెలుగు వెర్షన్ ఇప్పటి వరకూ 2.40 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన ఫైటర్ మూవీ థియేటర్ల లో రిలీజ్ అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ హనుమాన్ స్ట్రాంగ్ హోల్డ్ ను కనబరుస్తూ, సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. హను మాన్ లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు