హిందీలో 50 కోట్ల క్లబ్ లోకి “హను మాన్”

హిందీలో 50 కోట్ల క్లబ్ లోకి “హను మాన్”

Published on Feb 12, 2024 2:01 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నెలలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. హిందీ లో కూడా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, తాజాగా 50 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. వరల్డ్ వైడ్ గా హను మాన్ మూవీ 300 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం లాంగ్ రన్ ను కొనసాగిస్తోంది.

అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఇంకెన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు