100 కోట్ల క్లబ్ లోకి “హను మాన్”

100 కోట్ల క్లబ్ లోకి “హను మాన్”

Published on Jan 16, 2024 4:09 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న రిలీజైన ఈ సినిమా సెన్సేషన్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి, ప్రాఫిట్స్ లోకి అడుగు పెట్టింది. అయితే కేవలం నాలుగు రోజుల్లో 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది.

చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం సెన్సేషన్ అని చెప్పాలి. ఈ చిత్రం లో అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు