150 కోట్ల క్లబ్ లోకి “హను మాన్”

150 కోట్ల క్లబ్ లోకి “హను మాన్”

Published on Jan 19, 2024 11:40 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం కి వరల్డ్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది ఈ సినిమా. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా 150 కోట్ల రూపాయల క్లబ్ లో చేరడం జరిగింది. ఇదే విషయాన్ని మేకర్స్ నేడు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

హను మాన్ మూవీ కి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఈ చిత్రం టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ను సెట్ చేయడం జరిగింది. ఈ చిత్రం లో అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు