ఆడియెన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన “హను మాన్” టీమ్!

ఆడియెన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన “హను మాన్” టీమ్!

Published on Feb 16, 2024 6:00 PM IST


టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన హను మాన్ మూవీ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 300 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు హను మాన్ టీమ్ నైజాం ఏరియా ఆడియెన్స్ కోసం బంపర్ ఆఫర్ ను ఇవ్వడం జరిగింది.

ఈ వారం అంతా కూడా సింగిల్ స్క్రీన్ లకు 100 రూపాయలు, మల్టీ ప్లెక్స్ లకు 175 రూపాయలు టికెట్ రేట్ ను ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకూ చూడని వారికి, మళ్ళీ చూడాలని అనుకొనే వాటికి ఇది మంచి అవకాశం. అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు