నేడే రానా పుట్టిన రోజు

నేడే రానా పుట్టిన రోజు

Published on Dec 14, 2011 9:46 AM IST


విక్టరీ వెంకటేష్ గారి పుట్టిన రోజే తరువాత రోజే దగ్గుపాటి రానా పుట్టిన రోజు కూడా కావడం విశేషం. వెంకటేష్ తరువాత తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దగ్గుపాటి కుటుంబం నుండి వచ్చిన రెండవ తరం కథానాయకుడు రానా. 14 డిసెంబరు 1984 లో పుట్టిన ఆయన నేటితో 27 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. రానా డి.సురేష్ బాబు గారి కుమారుడు మరియు మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు గారి మనవడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లీడర్’ సినిమా రంగ ప్రవేశం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు, బాలీవుడ్ లో ‘దమ్ మారొ దమ్’ చిత్రంలో అభిషేక్ బచ్చన్ మరియు బిపాషా బసు తో కలిసి నటించారు.

రానా ప్రస్తుతం తెలుగులో ‘నా ఇష్టం’ చిత్రంలో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్ర షూటింగ్ ఈ రోజే ప్రారంభం కానుంది. ఇవే కాకుండా బాలీవుడ్ లో ‘డిపార్ట్మెంట్’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మరియు సంజయ్ దత్ తో కలిసి నటిస్తున్నారు.

123తెలుగు.కామ్ తరపున రానాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు