
టాలీవుడ్ యంగ్ హీరో, సందీప్ కిషన్ ఈరోజు తన 27వ జన్మదినం జరుపుకుంటున్నాడు. చెన్నైలో పుట్టి పెరిగిన సందీప్ కిషన్, ‘స్నేహ గీతం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. దేవ కట్ట దర్శకత్వంలో వచ్చిన ‘ప్రస్థానం’ సినిమాతో మంచి పేరు తేచుకున్న ఈ యువ నటుడు, ‘గుండెల్లో గోదారి’, ‘రొటీన్ లవ్ స్టొరీ’, ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ వంటి హిట్ సినిమాలలో ప్రధాన పాత్ర పోషించాడు.
ప్రస్తుతం సందీప్ కిషన్ ‘రారా క్రిష్ణయ్య’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ యువ హీరోకి తన కెరీర్ లో మరిన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటూ 123telugu.com సందీప్ కిషన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.