హ్యాపీ బర్త్ డే టు టాలీవుడ్ డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి.!

హ్యాపీ బర్త్ డే టు టాలీవుడ్ డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి.!

Published on Aug 2, 2023 3:00 PM IST

మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంగీతం అనేది ఓ చిత్రంలో ఎంత సుముఖ పాత్ర పోషిస్తుందో అందరికీ తెలుసు. ఓ సినిమాని పాటలు అలాగే నేపథ్య గీతం లేకుండా చూడడం అనేది అసలు వీలు పడదు అలా మనకి తెలియకుండానే ఒక సినిమాలో లీనం అయ్యేలా సంగీతం చేస్తుంది.

మరి అలాంటి సంగీతంతో టాలీవుడ్ లో ఎన్నో మెస్మరైజింగ్ ఆల్బమ్ లను అంతకు మించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లని డిఫరెంట్ షేడ్స్ లో అందించడంలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అలియాస్ డిఎస్పి తనకి తానే సాటి. తన మొదటి సినిమాతోనే సత్తా చాటి క్లాస్, మాస్, మెలోడి, పీరియాడిక్, ఫాంటసీ ఇలా ఏ జానర్ లో అయినా కూడా చాలా డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ ట్యూన్స్ ని దేవీ పలికించగలడు.

అందుకే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గా పిలుచుకునే తాను తన మాస్ బీట్స్ తో ఆడియెన్స్ ని అలరిస్తాడు. ఓ మాస్ ట్యూన్ క్లిక్ అయ్యింది అంటే ఇక అది దశాబ్దాలు పాటు వినిపిస్తూనే ఉంటుంది. ఒక 20 రూపాయల బూరతో పూనకాలు లోడింగ్ లాంటి చార్ట్ బస్టర్ ఇవ్వాలి అన్నా రీసెంట్ గానే దీని తర్వాత ఓ వాటర్ కాన్ తో కూడా ప్రయోగం చేస్తున్నాడు.

ఇక రీసెంట్ గా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్, కంగువా గ్లింప్స్ లలో తన మ్యూజిక్ కి కూడా స్పెషల్ అట్రాక్షన్ ఆడియెన్స్ నుంచి ఇలా ఎప్పటికప్పుడు కొత్తగా ఓ రేంజ్ మ్యూజిక్ ఇచ్చే దేవిశ్రీ ప్రసాద్ మరిన్ని సాలిడ్ ట్యూన్స్ తో మ్యూజిక్ ప్రపంచంలో మరింత రాణించాలి అన్ని తన బర్త్ డే సందర్భంగా మా 123తెలుగు యూనిట్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు