హ్యాపీ బర్త్ డే ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

హ్యాపీ బర్త్ డే ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

Published on Jun 4, 2014 2:01 PM IST

bala-subramanyam
45 ఏళ్ళ నుండి భారత సినిమా ఇండస్ట్రీలో దాదాపు అన్ని భాషలలో వినిపిస్తున్న తీయని, మరువపోలేని గొంతు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంగారిది.!–more–>ఈ లెజెండరీ గాయకుడు, ఈరోజు తన 67వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.

జూన్ 4, 1946లో నెల్లూరులోని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అయన చిన్న వయసు నుండే పాడడం మొదలుపెట్టాడు. కానీ తన తండ్రి ఒత్తిడి వలన అనంతపురం జెఎన్టీయూలో ఇంజనీరింగ్ చేయడానికి అక్కడ చేరారు, కానీ దానిని మధ్యలోనే వదిలేసారు. ప్రతి పాటను ప్రాణం పెట్టి పడే ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు హీరో గొంతుకు తగట్టు పాడడం అయన ప్రత్యేకత.

బాలు అని ముద్దుగా పిలువబడే ఇయన, దేశంలోని వివిధ భాషలలో మొత్తం 40 వేలకు పైగా పాటలు పాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి 25 సార్లు నంది అవార్డు పొందిన బాలు, 6 సార్లు జాతీయ అవార్డును దక్కించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 2011లో ఆయనను ‘పద్మ భూషణ్’ బిరుదుతో సత్కరించింది. ఆయనలా పదాలను ఉచ్చరించే వారు మరియు సంగీతంపై పట్టు ఉన్నవారు బహుశా మరే ఇతర గాయకుడు లేడనే చెప్పుకోవచ్చు.

ఈ ‘గాన గంధర్వుడికి’ 123telugu.com తరుపున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచెస్తున్నాం.

తాజా వార్తలు