
ఈరోజు తెలుగు సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు. మే 31 1934 న గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో పుట్టిన కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివ రామ కృష్ణ. కృష్ణ గారు తెలుగు చిత్ర సీమలో దాదాపు 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
1965 లో చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఆయన నెమ్మదిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తారా స్థాయికి చేరుకున్నారు. తెలుగులో ఎన్నో టెక్నాలజీలని పరిచయం చేసిన హీరోగా కృష్ణ ఖ్యాతి పొందారు.
డి. టి.యెస్, కలర్ ఫిలిం, 70 ఎం ఎం, సినిమాస్కోప్ కృష్ణ తెలుగు తెరకి పరిచయం చేసారు. ఈ టెక్నాలజీలతో పాటు కౌబాయ్ మరియు సిక్రెట్ ఏజెంట్ తరహ చిత్రాలను తను నటించిన ‘మోసగాళ్ళకి మోసగాడు’ ‘గూడచారి 116’ చిత్రాల ద్వారా పరిచయం చేసి ఎంతో మంచి పేరు సంపాదించారు.
350 చిత్రాలకు పైగా నటించిన కృష్ణ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లను ఆ కాలంలో అందించారు. ఆయన్ నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ ‘అల్లూరి సీత రామ రాజు’ ‘మోసగాళ్ళకి మోసగాడు’ ‘పండంటి కాపురం’ ‘అవే కళ్ళు’ ‘కొల్లేటి కాపురం’ ఇప్పటికి ఎంతో ఫేమస్.
ఎంతో అణకువైన స్వభావంతో మంచి మనసుతో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసారు. సూపర్ స్టార్ కృష్ణ గారికి 123తెలుగు తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

