హ్యాపీ మోమెంట్ : నిశ్చితార్ధం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్

హ్యాపీ మోమెంట్ : నిశ్చితార్ధం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్

Published on Mar 2, 2024 8:00 PM IST


కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో పలు సినిమాల్లో అనేక పాత్రల ద్వారా నటిగా ఆడియన్స్ ని మెప్పించి మంచి పేరు అందుకుంటూ కెరీర్ పరంగా కొనసాగుతున్నారు వరలక్ష్మీ శరత్ కుమార్.
విషయం ఏమిటంటే, నేడు తన ఫ్యాన్స్ కు ఆడియన్స్ కు వరలక్ష్మి శరత్ కుమార్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. నిన్న అనగా మార్చి 1న వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం జరిగింది. ఆమెకు కాబోయే భర్త పేరు నికోలాయ్ సచ్ దేవ్, ఆయన మంచి పేరున్న గ్యాలరిస్ట్. నిన్న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ నిశ్ఛితార్థ వేడుక జరిగింది.

కాగా వరలక్ష్మి, నికోచాయ్ లకు గత 14 సంవత్సరాలుగా పరిచయం ఉందని ఈ ఏడాది చివర్లో పెళ్లి జరగనుందని కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా వారి కుటుంబ సభ్యులు ఒక ప్రకటన రిలీజ్ చేసారు. వరలక్ష్మి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో వరలక్ష్మి పెళ్లికి సంబంధించి పలు వార్తలు వైరల్ అయినా ఆ వార్తలను ఆమె ఖండించారు. ఇక వరలక్ష్మి, నికోలాయ్ జోడీ బాగుందని వారిరువురికి పలువురు నెటిజన్స్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ముందస్తు వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు