వరుణ్ కొరకు చేసిన ఆ మార్పులను అంగీకరించండి -హరీష్ శంకర్

వరుణ్ కొరకు చేసిన ఆ మార్పులను అంగీకరించండి -హరీష్ శంకర్

Published on Sep 20, 2019 9:26 AM IST

తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన జిగర్తాండ మూవీ ఒక క్లాసిక్ హిట్ గా నిలిచిపోయింది. ఇప్పుడు అదే చిత్రాన్ని దర్శకుడు హరీష్ శంకర్ వాల్మీకి గా తెరకెక్కించారు. నేడు ఈ చిత్ర విడుదల నేపథ్యంలో ఆయన ఒరిజినల్ తమిళ చిత్రం జిగర్తాండ అభిమానులకు ఓ విన్నపం చేశారు. తాను హీరో వరుణ్ కొరకు వాల్మీకి లో చేసిన మార్పులను అంగీకరించి మూవీ చూడాల్సిందిగా కోరుకున్నారు.

జిగర్తాండ మూవీ కథ ఉన్నతమైనదైనప్పటికీ హీరో వరుణ్ ఇమేజ్ దృష్ట్యా అలాగే, తెలుగు, తమిళ ప్రజల మధ్య ఉండే నేటివిటీ మార్పుల దృష్ట్యా వాల్మీకి చిత్రంలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఈ మార్పులు నచ్చినా, నచ్చకున్నా మూవీ ని ఒకసారి చూడండి. ఈ మెస్సేజ్ ద్వారా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మరియు ఆయన చిత్రం జిగర్తాండ పై నాకున్న గౌరవం తెలియజేస్తున్నాను అని ఆయన తెలపడం జరిగింది.

అనూహ్యంగా ఈ చిత్రానికి విడుదలకు చివరి నిమిషంలో షాక్ తగిలింది. వాల్మీకి టైటిల్ పై ఉన్న వివాదం రీత్యా కోర్ట్ ఆదేశాల కారణంగా గడ్డలకొండ గణేష్ గా మార్చవలసి వచ్చింది. అధర్వ, పూజ హెగ్డే, బ్రహ్మానందం, బ్రహ్మజీ, సత్య వంటి నటులు ఇతర కీలక పాత్రలలో కనిపిస్తుండగా, ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు