రామ్ నెక్స్ట్ సినిమా టైటిల్ – ‘హరి కథ’..?

ram-pothineni
ప్రేక్షకులందరికీ యంగ్ హీరో రామ్ ‘హరి కథ’ చెప్పడానికి రెడీ అయ్యాడు. ‘సెకండ్ హ్యాండ్’ సినిమా ఫేం కిషోర్ తిరుమల చెప్పిన కథకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరి కథ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ప్రస్తుతం కిషోర్ తిరుమల స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పండగ చేస్కో’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత ‘హరి కథ’ మొదలయ్యే అవకాశం ఉంది. రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version