
కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెలుగు ప్రేక్షకులను మెప్పించి తనకి మంచి హిట్ ఇస్తుందని ఆశించిన ‘శివమ్’ సినిమా సక్సెస్ కాకపోవడంతో కాస్త డీలా పడిన యంగ్ హీరో రామ్ తన తదుపరి సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే తన తదుపరి సినిమా హరికథలో బాగా రాని సీన్స్ ని మళ్ళీ రీ షూట్ చేయడమే కాకుండా మిగిలిన షూట్ ని కూడా ఈ ఏడాది లోనే ఫినిష్ చేసి రిలీజ్ కి సిద్దం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే ఈ చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్ ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేస్తాడని చెప్పారు.
కానీ తాజాగా ఈ చిత్ర టీం చెబుతున్న సమాచారం ప్రకారం, హరికథ రిలీజ్ కోసం ఓ సెంటిమెంట్ డేట్ ని ఫిక్స్ చేసారట. అదే 2016 జనవరి 1. ఈ ఏడాది జనవరి 1న స్రవంతి మూవీస్ బ్యానర్ నుంచి వచ్చిన రఘువరన్ బిటెక్ అనే చిఎన్మా పెద్ద విజయాన్నిఅందుకుంది. దాంతో స్రవంతి మూవీస్ బ్యానర్ కి కలిసి వచ్చిన ఈ రిలీజ్ డేట్ ని హరికథకి కూడా ఫాలో అవ్వాలని చూస్తున్నారట. అందుకే డిసెంబర్ మిడిల్ లోపు షూటింగ్ ని ఫినిష్ చేసి జనవరి 1 రిలీజ్ కి సిద్దం చేయనున్నారట. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. తండ్రి – కుమార్తెల మధ్య ప్రేమాను బంధాలకి పెద్దపీట వేస్తూ చేసిన హరికథ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.