పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన హరితేజ

Published on Apr 6, 2021 6:10 pm IST

ఇటు బుల్లితెర, అటు వెండితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి హరితేజ. బిగ్ బాస్ రియాలిటీ షోలో ఆకట్టుకుని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు ఆమె. లాక్ డౌన్ వేళ తాను గర్భవతిని అయ్యానంటూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని షేర్ చేసుకున్న హరితేజ నిన్న పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్టాలో ప్రకటించారు.

ప్రస్తుతం తల్లి, పాప సురక్షితంగా ఉన్నారు. ఆమె పెట్టిన పోస్ట్ చూసి ఆమెకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు. పలువురు సినీ, టీవీ ప్రముఖులు కూడ హరితేజకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొదట టెలివిజన్ తెరపై మనసు మమత, రక్త సంబంధం, అభిషేకం లాంటి పాపులర్ సీరియళ్లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హరితేజ ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు హిట్ సినిమాలు చేసి మెప్పించారు.

సంబంధిత సమాచారం :