“ఆపరేషన్ వాలెంటైన్” ఫైనల్ స్ట్రైక్ పై హరీష్ శంకర్ కామెంట్స్!

“ఆపరేషన్ వాలెంటైన్” ఫైనల్ స్ట్రైక్ పై హరీష్ శంకర్ కామెంట్స్!

Published on Feb 21, 2024 11:45 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో, శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. మార్చ్ 1, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకూ సినిమా నుండి రిలీజైన చేసిన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిన్న ఈ సినిమా కి సంబందించిన ఫైనల్ స్ట్రైక్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సైతం వీడియో పై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ స్ట్రైక్ కిక్ యాస్ గా ఉంది అని, సంథింగ్ స్పెషల్ గా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం FDFS ను చూస్తా అంటూ చెప్పుకొచ్చారు హరీష్ శంకర్. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మానుషి చిల్లర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం కి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు