వరుణ్ తేజ్ కి హరీష్ శంకర్ బెస్ట్ విషెస్!

వరుణ్ తేజ్ కి హరీష్ శంకర్ బెస్ట్ విషెస్!

Published on Feb 29, 2024 9:00 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ రేపు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకి కూడా ప్రమోషన్స్ ను గట్టిగానే చేశారు మేకర్స్. అయితే సినిమా రిలీజ్ సందర్భం గా డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదిక గా వరుణ్ తేజ్ కి బెస్ట్ విషెస్ తెలిపారు.

బ్రదర్ వరుణ్ తేజ్ కి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు. మానుషి చిల్లర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో నవదీప్, రుహాని శర్మ, మీర్ సర్వర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ చిత్రం థియేటర్ల లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు