పవన్ సినిమాల్ని వదిలినా.. సినిమా పవన్ని వదలదు !

Published on Apr 5, 2021 11:04 am IST

సుదీర్ఘ విరామం తరువాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తోన్న ‘వకీల్‌సాబ్’. ఈ సినిమాతో ఏప్రిల్ 8న వెండితెరపైకి రానుంది. ఇక ఈ సినిమాలో పవన్ ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘మన అభిమానులకు చాలా రోజుల తర్వాత వచ్చిన పండగ ఇది. పవన్‌కళ్యాణ్ మళ్లీ బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలు స్టార్ చేసినందుకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను.

ఎందుకంటే.. లాక్‌డౌన్ తర్వాత కుదేలైన పరిశ్రమని మెరుగుపరిచేందుకు వంద కోట్ల టర్నోవర్ చేస్తూ.. ఎంతో మంది ఉపాధి కల్పించే దిశగా ఆయన సినిమాను చేస్తున్నందుకు ఆయనకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. అయితే నేను కేవలం ఆయన్ని మాత్రం పొగడటం లేదు. లాక్‌డౌన్ తర్వాత సినిమా చేస్తున్న ప్రతీ హీరోకి, ప్రతీ ఆర్టిస్టుకి, ప్రతీ టెక్నీషిన్‌కి నేను ధన్యవాదాలు చెబుతున్నాను. ఏ సినిమా అయినా, ఎవరి సినిమా అయినా అది సక్సెస్ అయితే ముందుగా సంతోషించే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన సినిమాల్ని వదిలేద్దామనుకున్నా.. సినిమా ఆయన్ని వదలదు అంటూ హరీష్ ఇచ్చిన స్పీచ్ కూడా పవన్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం :