సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో హిట్ కోడతానంటున్న హరీష్ శంకర్

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో హిట్ కోడతానంటున్న హరీష్ శంకర్

Published on Nov 27, 2014 9:14 PM IST

Subramanyam for sale (38)
టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసి కొత్త రికార్డులను సృష్టించాడు. అయితే ఆ తరువాత ఎన్.టి.ఆర్ తో తీసిన రామయ్యా వస్తావయ్యా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడింది. అయితే కొంతకాలం విరామం తరువాత ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశం దగ్గరనుండి పాజిటీవ్ నోట్ లో ప్రారంభం కావడం విశేషం

అయితే ఈ సినిమాను పవర్ ప్యాకడ్ సబ్జెక్ట్ రూపంలో తెరకెక్కించినట్టు, ప్రేక్షకులు ఈసారి నిరాశ చెందే అవకాశం లేనట్టు హరీష్ తెలిపారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ హీరో, రెజినా హీరోయిన్. దిల్ రాజు నిర్మాత

సంబంధిత సమాచారం

తాజా వార్తలు