పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ సినిమా ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. ఆ సినిమాతోనే హరీష్ స్టార్ డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు పొందాడు. కానీ గత కొన్ని సినిమాలుగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడటం లేదు.
కాగా తాజాగా హరీష్ శంకర్ సూపర్ హిట్ తమిళ సినిమా ‘జిగర్తాండ’ను వరుణ్ తేజ్ తో తెలుగులోకి రీమేక్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ 2019 జనవరి నుండి మొదలు కానుంది. అయితే బాబాయ్ కి భారీ హిట్ ఇచ్చినట్లుగానే అబ్బాయికి కూడా హరీష్ భారీ హిట్ ఇస్తాడేమో చూడాలి.
థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి అంచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


