హరీశ్ శంకర్ బ్రహ్మానందంతో సూపర్ కామెడీ ట్రాక్ సెట్ చేశారా?

హరీశ్ శంకర్ బ్రహ్మానందంతో సూపర్ కామెడీ ట్రాక్ సెట్ చేశారా?

Published on Sep 5, 2019 1:32 AM IST

వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘వాల్మీకి’ చిత్రాన్ని అన్ని విధాలా ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు హరీశ్ శంకర్. ఇప్పటికే మాస్ ప్రేక్షకుల కోసం ఐటమ్ సాంగ్ లాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ సెట్ చేసిన హరీశ్ ఇప్పుడు వినోదాన్ని కోరుకునే వారి కోసం మంచి కామెడీ ట్రాక్ సెట్ చేసినట్టు కనిపిస్తోంది.

అందుకోసం కామెడీ కింగ్ బ్రహ్మానందాన్ని సినిమాలోకి తీసుకున్నారు. బ్రహ్మానందాన్ని తీసుకోవాలనే ఆలోచనను హరీశ్ చివరి నిముషంలో తీసుకుని ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ రాసి షూటింగ్ జరుపుతున్నారు. మరి చివరి దశలో హరీశ్ చేస్తున్న ఈ అడిషన్ సినిమాకు ఎంతవరకు ఉపకరిస్తుందో, చాన్నాళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న బ్రహ్మానందం మునుపటిలా నవ్విస్తారేమో చూడాలి. ఈ నెల 20న విడుదలవుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు