యువ నటుడు హీరో సుధీర్‌బాబు నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ హరోంహర. ది రివోల్ట్ అనే ఉపశీర్షికతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. మాళవికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సుమంత్ జి.నాయుడు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌తో పాటు ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.
అయితే ఈ సినిమా నుండి కనులెందుకో అనే పల్లవితో సెకండ్ సాంగ్ ని ఏప్రిల్ 24న విడుదల చేయనున్నట్లు తాజాగా మేక్స్ అనౌన్స్ చేసారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అలానే త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. 1989 కాలం నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీలో సునీల్, రవి కాలే, కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్, అర్జున్ గోవిందా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.