“హరోంహర” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి రెడీ!

“హరోంహర” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి రెడీ!

Published on Feb 12, 2024 7:40 PM IST

టాలీవుడ్ హీరో సుదీర్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ జ్ఞానసాగర్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ హరోం హర. ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం కి సంబందించిన ఫస్ట్ అప్డేట్ పై మేకర్స్ సరికొత్త ప్రకటన చేయడం జరిగింది. ఫిబ్రవరి 14 వ తేదీన సాయంత్రం 5:00 గంటలకు హరోం హరోం హర సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. మాళవిక శర్మ, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. సుమంత్ జీ. నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు