సునీల్ కి “హరోం హర” టీమ్ బర్త్ డే విషెస్!

సునీల్ కి “హరోం హర” టీమ్ బర్త్ డే విషెస్!

Published on Feb 28, 2024 5:52 PM IST

టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు ప్రధాన పాత్రలో, జ్ఞాన సాగర్ ద్వారక రచన, దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ హరోం హరా. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మన్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జీ. నాయుడు నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మాలవిక శర్మ లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రం కి సంబందించిన ప్రచార చిత్రాలు రిలీజై ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రం లో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సునీల్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ లో సునీల్ స్వాగ్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు