కరోనా బారిన పడిన యువ హీరో

Published on Oct 6, 2020 5:13 pm IST

కరోనా వైరస్ తాకిడికి ఎవ్వరూ అతీతులు కాదన్నట్టు సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు చాలామంది కోవిడ్ బారిన పడ్డారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. ఇలా అన్ని పరిశ్రమల్లోని నటీనటులు కొందరికి ఇప్పటికే వైరస్ సోకగా ఇటీవల స్టార్ హీరోయిన్ తమన్నా సైతం కోవిడ్ బారినపడ్డారు. కొన్నిరోజులు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకున్నాక కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా మరొక యువ హీరో హర్షవర్థన్ రాణేకు కరోనా పాజిటివ్ అని తేలింది. మైల్డ్ అటాక్ కావడంతో ఆయన హోమ్ క్వారంటైన్లో ఉంటూ జాగ్రత్తలు పాటిస్తున్నారు.

ఈ విషయం మీద స్పందించిన ఆయన జ్వరం, కడుపులో నొప్పి రావడంతో డాక్టర్ వద్దకు వెళ్లానని, పరీక్షలు చేసిన వైద్యులు లంగ్స్ హెల్తీగానే ఉన్నాయని, వైరల్ ఫీవర్ అయ్యుండొచ్చని అన్నారు. ముందు జాగ్రత్తగా కోవిడ్ పరీక్ష కూడ చేయించాను. ఇప్పుడు ఆ ఆరోగ్యసేతు యాప్ నాకు కరోనా పాజిటివ్ అని చూపిస్తోంది. అందుకే 10 రోజులు ఐసోలేషన్లో ఉంటున్నాను. మీకో శుభవార్త చెప్పాలని అనుకున్నాను. కానీ ఇంతలో ఇలా జరిగింది. ఆ వార్తను 10 రోజుల తర్వాత చెబుతాను అంటూ వివరణ ఇచ్చారు.

ఈ వార్త తెలిసిన వెంటనే అభిమానులు ఆయనకు త్వరగా కోలుకోవాలని సామాజిక మాద్యమాల ద్వారా సందేశాలు పంపుతున్నారు. హర్షవర్థన్ హీరోగా పరిచయమైంది తెలుగు సినిమాలతోనే. ‘తకిట తకిట, నా ఇష్టం, అవును, ప్రేమ ఇష్క్ కాదల్, అవును 2, ఫిదా’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హర్షవర్థన్ హిందీలో కూడా సినిమాలు చేస్తున్నాడు. ప్రజెంట్ అయన బిజో నంబియార్ దర్శకత్వంలో ‘టైష్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :