రొమాంటిక్ సీన్స్ తో మెప్పిస్తాడట !

రొమాంటిక్ సీన్స్ తో మెప్పిస్తాడట !

Published on Jul 13, 2019 6:06 PM IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా ‘డియర్ కామ్రేడ్’తో ఈ నెల 26న రాబోతున్నారు. ఇప్పటికే వినూత్నమైన ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటున్న ‘డియర్ కామ్రేడ్’.. సినిమాలో రొమాంటిక్ సీన్స్ తో కూడా బాగా ఆకట్టుకుంటాడట. ముఖ్యంగా సినిమాలో మూడు లిప్ కిస్ లు కాస్త ఘాటుగానే ఉంటాయని తెలుస్తోంది. రొమాంటిక్ సన్నివేశాల్లో ఈ జంట ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా.. రెచ్చిపోయి మరీ నటించారట. సినిమాలో ఎమోషన్ పెయిన్ ఎలా ఉన్నా.. యూత్ ని మాత్రం రొమాంటిక్ సీన్స్ తోనే ‘డియర్ కామ్రేడ్’ బాగా మెప్పిస్తాడని సినిమా సంబధించిన వ్యక్తులే చెబుతున్నారు.

ఇక ఈ చిత్రం అన్ని సౌత్ భాషల్లో రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రంలో రష్మిక స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్ గా నటిస్తోండగా.. విజయ్ దేవరకొండ సోషల్ భావాలు ఉన్న స్టూడెంట్ గా.. టిపికల్ లవర్ గా కనిపించనున్నాడు. భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్నీ మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. మరి విజయ్ దేవరకొండకు ‘డియర్ కామ్రేడ్’ ఏ రేంజ్ హిట్ ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు