వార్ సీన్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారట !

Sye Raa1
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నర్సింహారెడ్డి’. ఆయన బర్త్ డే కానుకగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమా షూటింగ్ జార్జియా దేశంలో జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ భారీ యుద్ధ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈవార్ సీన్ కోసం సుమారు 45కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారట. ఇంతకుమందు ఎన్నడూ చూడని విధంగా హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ల పర్యవేక్షణలో ఈ దృశ్యాలను తెరకెక్కిస్తున్నారట.

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరక్కుతున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ , సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా వంటి భారీ తారాగణం ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.

Exit mobile version