భారీ పోరాటానికి సిద్దమవుతున్న స్టార్లు

భారీ పోరాటానికి సిద్దమవుతున్న స్టార్లు

Published on Jan 29, 2020 7:58 PM IST

స్టార్ హీరో విజయ్ చేస్తున్న చిత్రం ‘మాస్టర్’. ఇందులో మరొక స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి మీద డిల్లీలో కొంత భాగం చిత్రీకరణ జరగ్గా మరొక షెడ్యూల్ ఫిబ్రవరి రెండవ వారంలో జరగనుంది. ఈ షెడ్యూల్ తమిళనాడులోని నెయ్వెలి కోల్ మైన్స్ నందు జరగనుంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి టెరకెక్కించనున్నారు.

సినిమా మొత్తానికి ఇదే పెద్ద ఫైట్ సీన్. దీన్ని ప్రముఖ ఫైట్ మాస్టర్ సిల్వ డిజైన్ చేస్తున్నారు. ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో విజయ్ ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ యేడాది ఏప్రిల్ 9న చిత్రం విడుదలకానుంది. ‘బిగిల్’ లాంటి భారీ హిట్ తర్వాత విజయ్ చేస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీస్థాయి అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు