కొత్త అడుగులేస్తున్న హెబ్బా పటేల్ !

hebah

‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన హీరోయిన్ హెబ్బా పటేల్ ఆ తరవాత వరుసగా సినిమాలు చేసింది. 2016లో మూడు చిత్రాలు, 2017లో మరో మూడు చిత్రాలు ఇలా వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేసిన ఆమెకు 2018లో ఉన్నట్టుండి పరాజయాలు ఎదురయ్యాయి. 2018లో ’24 కిసెస్’ అనే సినిమాతో మాత్రమే సరిపెట్టుకుంది.

కానీ, అది కూడా ప్లాప్ కావడంతో కొంత వెయిట్ చేసి నితిన్, వెంకీ కుడుముల కలిసి చేస్తున ‘భీష్మ’ చిత్రంలో నటిస్తోంది. దీంతోపాటే ఇంకో అడుగు ముందుకేసి సమంత తరహాలోనే వెబ్ సిరీస్ చేయడానికి సన్నద్దమైంది. ఈ వెబ్ సిరీస్ ను అజయ్ భుయాన్ డైరెక్ట్ చేయనున్నాడు. మరి ఈ కొత్త ప్రయత్నంతోనైనా హెబ్బా పటేల్ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

Exit mobile version