సెప్టెంబర్లో రానున్న ‘హలో గురు ప్రేమకోసమే’ !

సెప్టెంబర్లో రానున్న ‘హలో గురు ప్రేమకోసమే’ !

Published on May 14, 2018 6:12 PM IST

గతేడాది ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రంతో మన ముందుకొచ్చిన హీరో రామ్ ప్రస్తుతం ‘హలో గురు ప్రేమకోసమే’ అనే సినిమా చేస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలో రామ్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇంకో రెండు షెడ్యూళ్లలో షూటింగ్ మొత్తం పూర్తిచేసుకోనున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో విడుదలచేయనున్నారు.

‘సినిమా చూపిస్తా మావ, నేను లోకల్’ చిత్రాల్ని తెరకెక్కించిన దర్శకుడు త్రినాథ్ రావ్ నక్కిన ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ విడుదలైంది. విజయ్ కె చక్రవర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు