వరల్డ్ స్టంట్ అవార్డ్స్ కు నామినేట్ అయిన అఖిల్ చిత్రం !

వరల్డ్ స్టంట్ అవార్డ్స్ కు నామినేట్ అయిన అఖిల్ చిత్రం !

Published on May 14, 2018 4:26 PM IST

అక్కినేని అఖిల్ నటించిన ‘హలో’ చిత్రం గత ఏడాది విడుదలై మంచి ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలోని యాక్షన్ స్టంట్స్ అందరి దృష్టినీ ఆకర్షించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటిని హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ బాబ్ బ్రౌన్ కంపోజ్ చేశారు.

ఇప్పుడీ చిత్రం ప్రఖ్యాత టారస్ వరల్డ్ స్టంట్ అవార్డ్స్ 2018 కు ఉత్తమమైన యాక్షన్ స్టంట్స్ కలిగిన ఫారిన్ ఫిల్మ్ క్యాటగిరీలో నామినేట్ అయింది. దీనితో పాటు జర్మనీకి చెందిన ‘ప్లాన్-బి’, స్పెయిన్ చిత్రం ‘సోలో సె విప్ ఉన వెజ్’, రష్యన్ చిత్రం ‘రోడ్ టూ కావర్లి’, చైనాకు చెందిన ‘ఉల్ఫ్ వారియర్ 2’ వంటి చిత్రాలు ఈ క్యాటగిరీలో నామినేట్ అయ్యాయి. ఈ చిత్రాలన్నిటినీ దాటుకుని మన ‘హలో’ చిత్రం అవార్డును కైవసం చేసుకోవాలని కోరుకుందాం.

తాజా వార్తలు