ఆస్కార్స్ 2024 : 96వ అకాడమీ అవార్డ్స్ టోటల్ విన్నర్స్ లిస్ట్ ఇదే

Oscars 2024

ప్రపంచ ప్రఖ్యాత అవార్డు అయినటువంటి ఆస్కార్ అవార్డు కోసం అందరికీ తెలిసిందే. మరి గత ఏడాది ప్రపంచ దేశాలతో ఇండియన్ సినిమా ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కూడా అదరగొట్టగా ఇప్పుడు 2024 లో గ్రాండ్ గా జరిగిన ఆస్కార్ ఈవెంట్ తో అనేక చిత్రాలు సత్తా చాటాయి. యూఎస్ లోని లాస్ ఏంజెల్స్, డాల్బీ థియేటర్ లో అట్టహాసంగా అనేకమంది హాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్ లో వరల్డ్ వైడ్ గా అనేక చిత్రాలు డాక్యుమెంటరీలు ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నాయి. మరి ఈ ఈవెంట్ లో గెలుపొందిన టోటల్ విన్నర్స్ లిస్ట్ ఈ విధంగా ఉంది.

ఉత్తమ చిత్రం : ఓపెన్‌హైమర్

మెయిన్ లీడ్ లో ఉత్తమ నటుడు : సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్)

ఉత్తమ సహాయ నటుడు : రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)

ఫీమేల్ లీడ్ లో ఉత్తమ నటి : ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)

సహాయ పాత్రలో ఉత్తమ నటి : డావిన్ జాయ్ రాండోల్ఫ్ (ది హోల్డోవర్స్)

ఉత్తమ దర్శకుడు : క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ : ది బాయ్ అండ్ ది హెరాన్

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే : అమెరికన్ ఫిక్షన్

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : అనాటమీ ఆఫ్ ఎ ఫాల్

ఉత్తమ సినిమాటోగ్రఫీ : ఓపెన్‌హైమర్

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ : పూర్ థింగ్స్

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ : 20 డేస్ ఇన్ మరియుపోల్

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ : ది లాస్ట్ రిపేర్ షాప్

ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ : ఓపెన్‌హైమర్

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ : ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైలింగ్ : పూర్ థింగ్స్

ఉత్తమ ఒరిజినల్ స్కోర్ : ఓపెన్‌హైమర్

ఉత్తమ ఒరిజినల్ సాంగ్ : వాట్ వాస్ ఐ మేడ్ ఫర్ (బార్బీ)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : పూర్ థింగ్స్

ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ : వార్ ఈజ్ ఓవర్!

బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : ది వండర్ ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్

బెస్ట్ సౌండ్ : ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా: మైనస్ వన్(జాపనీస్)

అయితే ఈ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన “ఓపెన్‌హైమర్” 14 నామిషన్స్ కి గాను 7 ఆస్కార్‌లను కొల్లగొట్టడం విశేషం. అలాగే ఈ ఏడాదిలో ఇదే హైయెస్ట్. ఇక ఈ చిత్రం తర్వాత ఎమ్మా స్టోన్స్ నటించిన “పూర్ థింగ్స్” 4 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది.

Exit mobile version