కోహ్లీ – ఎన్టీఆర్ వైరల్ గా మారిన వార్తలపై క్లారిటీ!

కోహ్లీ – ఎన్టీఆర్ వైరల్ గా మారిన వార్తలపై క్లారిటీ!

Published on May 26, 2024 10:00 PM IST

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం “దేవర” సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంతో మరోసారి తారక్ పాన్ ఇండియా ఆడియెన్స్ ని పలకరించనుండగా ఇప్పుడు ఈ చిత్రం నుంచి వచ్చిన సాంగ్ కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.

ఇక ఇదిలా ఉండగా ఎన్టీఆర్ విషయంలో ఇండియన్ క్రికెటర్, రన్ మెషిన్ కోహ్లీ చేసిన కామెంట్స్ అంటూ కొన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇవి కొందరు నిజం కాదని ఫేక్ ని అంటున్నారు. మరికొందరు నమ్ముతున్నారు. అయితే అసలు దీనిపై క్లారిటీ తెలుస్తుంది. కోహ్లీ – ఎన్టీఆర్ పై వచ్చిన వార్తలు వాస్తవమే అట.

కోహ్లీ మన టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం, అభిమానం కూడా అట. అంతే కాకుండా తారక్ వ్యక్తిత్వం కూడా కోహ్లీ కి ఇష్టమని, ఇద్దరు కొన్ని ముఖ్య సందర్భాల్లో వీడియో కాల్స్ లో కూడా టచ్ లో ఉంటారట. అయితే వీరి బాండింగ్ కి అప్పట్లో జరిగిన ఒక యాడ్ షూట్ బీజం వేసిందట. అక్కడ నుంచి కోహ్లీ, ఎన్టీఆర్ ఇద్దరూ స్నేహంగా ఉన్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు