ప్రశాంత్ వర్మ, రణ్వీర్ భారీ ప్రాజెక్ట్ పై అసలు క్లారిటీ ఇదే.!

ప్రశాంత్ వర్మ, రణ్వీర్ భారీ ప్రాజెక్ట్ పై అసలు క్లారిటీ ఇదే.!

Published on May 25, 2024 3:00 PM IST


ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర షైన్ అవుతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో సూపర్ హీరో సినిమా చేసి పాన్ ఇండియా హిట్ కొట్టిన యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఒకడు. మరి ప్రశాంత్ వర్మ “హను మాన్” (Hanu Man Movie) సక్సెస్ తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోగా తన లైనప్ లో ఏకంగా బాలీవుడ్ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నాడు.

బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన రణ్వీర్ సింగ్ తో భారీ సినిమా చేస్తున్నట్టుగా టాక్ ఉంది. అలాగే ఈ సినిమా కూడా తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన సినిమాగానే ఉంటుంది అనీ బజ్ వచ్చింది. మరి ఈ చిత్రంపై జస్ట్ రీసెంట్ గానే ఆగిపోయింది అంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి. అలాగే వీరు ఓ యాడ్ కోసం మాత్రమే వర్క్ చేస్తున్నారు అంటూ ఎన్నో రూమర్స్ వచ్చేసాయి.

మరి వీటి అన్నిటి పైనా అసలు క్లారిటీ ఇప్పుడు తెలుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో భారీ సినిమా ఖచ్చితంగా ఉందట. అలాగే ఆల్రెడీ ఫోటో షూట్, సినిమా సంబంధించి అనౌన్సమెంట్ కి సాలిడ్ ప్రోమో కట్ ని కూడా సిద్ధం చేసారని ఇది మంచి సమయం చూసుకొని వస్తుంది అని సమాచారం. సో ఈ క్రేజీ కాంబినేషన్ పై వచ్చే నెగిటివ్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అందరూ గమనించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు