అలవైకుంఠపురంలో చిత్రానికి భారీ హైప్ క్రియేట్ చేసింది సామజవరగమనా సాంగ్. థమన్ స్వర కల్పనలో స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ యూత్ కి బాగా ఎక్కేసింది. యూ ట్యూబ్ లో కూడా వందల మిలియన్స్ లో వ్యూస్ దక్కించుకొని సత్తా చాటింది ఈ పాట. కాగా అల వైకుంఠపురంలో చిత్ర యూనిట్ నేడు సర్ప్రైజింగ్ గా ఈ సాంగ్ కి ఫిమేల్ వర్షన్ విడుదల చేశారు. అది కూడా టాప్ ఫిమేల్ సింగర్ శ్రేయా ఘోషల్ తో పాడించారు. కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించిన వీడియో విడుదల చేశారు. సాధారణమైన సాంగ్స్ కి కూడా తన గొంతుతో అందం తీసుకొచ్చే శ్రేయా ఘోషల్ ఈ హిట్ సాంగ్ కి మరింత ఆకర్షణ తీసుకురానుంది.
ఇక దర్శకుడు త్రివిక్రమ్ బన్నీ తో చేసున్న హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో. సంక్రాంతికి బరిలో దిగుతున్న ఈ చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలున్నాయి. అల్లు అర్జున్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుండగా టబు, సుశాంత్, నివేదా పేతురాజ్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.
సాంగ్ వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.


