బోల్డ్ అండ్ ఇంటెన్స్ లవ్ తో ‘మిస్టర్ అండ్ మిస్’ ట్రైలర్

బోల్డ్ అండ్ ఇంటెన్స్ లవ్ తో ‘మిస్టర్ అండ్ మిస్’ ట్రైలర్

Published on Feb 29, 2020 11:12 AM IST

శైలేశ్, జ్ఞానేశ్వరి హీరో హీరోయిన్లుగా దర్శకుడు అశోక్ రెడ్డి తెరకెక్కించిన యూత్ ఫుల్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ మిస్టర్ అండ్ మిస్. కొత్తవారితో క్రౌడ్ ఫండెడ్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్ విడుదల కాగా విశేష ఆదరణ దక్కించుకుంది. మూవీ విడుదలకు సిద్దమైన నేపథ్యంలో నేడు ట్రైలర్ విడుదల చేశారు.

హీరో హీరోయిన్ల మధ్య ఘాడమైన ప్రేమ, మనస్పర్థలు బ్రేక్ అప్ వంటి విషయాలను ప్రస్తావిస్తూ ఈ చిత్రం తెరకెక్కింది. ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ కలిగిన జంట కొన్ని కారణాల వలన విడిపోతే, వారి మధ్య నడిచే సంఘర్షణే ఈ చిత్రం.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు