వణుకుపుట్టిస్తున్న ప్రశాంత్ వర్మ మూవీ మోషన్ పోస్టర్.

Published on May 29, 2020 11:35 am IST

ప్రకటించిన విధంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన లేటెస్ట్ మూవీ మోషన్ పోస్టర్ తో వచ్చేశాడు. మోషన్ పోస్టర్ వీడియోలో తెలుగు తల్లి విగ్రహం, ఆ వెనుక ఓ బురుజు, ట్రాఫిక్ సిగ్నల్, రోడ్డుపై నిర్జీవంగా పడివున్న జనాలతో భీతి గొలిపేలా ఉంది. ఇక కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత బాగా పాపులరైన స్లోగన్ స్టే హోమ్ స్టే సేఫ్ అనే బోర్డు కూడా మోషన్ పోస్టర్ లో ఉంది. కరోనా వైరస్ కల్పిత రూపాన్ని కూడా ప్రశాంత్ వర్మ తన మోషన్ పోస్టర్ లో చూపారు.

యదార్ధ ఘటనల ఆధారంగా కరోనా వైరస్ వలన ఏర్పడిన దుర్భర పరిస్థితులు, భయానక సంఘటనలతో పాటు, దానికి పరిష్కారం మరియు వాక్సిన్ వంటి అనేక విషయాలతో ఈ చిత్రం తెరకెక్కనుంది . మొత్తంగా మోషన్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తి పెంచేశాడు ప్రశాంత్ వర్మ. కొద్దిరోజులలో టైటిల్ తో కూడా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నాడు.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

More