విజయ్ “గోట్” రెండో సాంగ్ పై అప్డేట్ ఇచ్చేసిన దర్శకుడు

విజయ్ “గోట్” రెండో సాంగ్ పై అప్డేట్ ఇచ్చేసిన దర్శకుడు

Published on Apr 27, 2024 1:57 PM IST


ఇళయ దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం”. మరి ఈ సినిమా విజయ్ కెరీర్ లో 68వ సినిమాగా తెరకెక్కిస్తుండగా భారీ హైప్ దీనిపై నెలకొంది. ఇక ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ లుక్ అలాగే మొదటి పాటకి బాగానే రెస్పాన్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ఎప్పుడు ఏంటి అనేది క్లారిటీ వచ్చేసింది.

సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉండే దర్శకుడు వెంకట్ ప్రభు విజయ్ ఫ్యాన్ కి రిప్లై ఇచ్చారు. గోట్ రెండో పాట జూన్ లో ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. జూన్ లో ఎలాగో విజయ్ బర్త్ డే ఉంది కాబట్టి అప్పుడే ఈ సాంగ్ వస్తుంది అని చెప్పవచ్చు. అయితే సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఇచ్చిన ఫస్ట్ సింగిల్ కి పాజిటివ్ అయితే రాలేదు. మరి ఈ సాంగ్ కి అయినా మంచి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని ఏ జి ఎస్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తుండగా పాన్ ఇండియా భాషల్లో ఈ సెప్టెంబర్ 5న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు