ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న జార్జిరెడ్డి !

ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న జార్జిరెడ్డి !

Published on Oct 8, 2019 3:27 PM IST

జార్జిరెడ్డి…దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన జార్జిరెడ్డిని చాలా చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్థులు క్యాంపస్ లోనే హత్య చేశారు. ఎందరో విద్యార్తులను కదిలించిన వ్యక్తి, అలాంటి ఆదర్శనీయమైన విద్యార్థి నేత జీవితం వెండితెరపై ఆవిష్కృతం కాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ‘దళం’ సినిమాతో విబిన్నమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. కాగా తాజగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ లో జార్జ్ రెడ్డి సినిమా బయోపిక్ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఒక కమర్షియల్ హీరో తెరమీర చేసే సాహసాలన్నీజార్జ్ నిజజీవితంలో చేసినట్టు ఈ ట్రైలర్ ను చూస్తే అర్థమవతుంది. చరిత్ర మరిచిపోయిన లీడర్ అనే విషయాన్ని ట్రైలర్ లో బాగా హైలెట్ చేశారు. ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

మొత్తంగా ఓ ఫర్ గాటెన్ లీడర్ కథను తీసుకు వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ఒక్కసారిగా సినిమాపై ఆసక్తిని పెంచింది. 1960, 70 లలో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను ట్రైలర్ లో బాగా చూపించారు. మైక్ మూవీస్ బ్యానర్ తో కలిసి త్రీ లైన్స్, ‘‘సిల్లీ మాంక్స్ స్టూడియో’’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘‘వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్ (సాండి) ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండగా, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి ఇతర నటీనటులు. ప్రముఖ హీరో సత్య దేవ్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు