“విశ్వంభర” సెట్స్ లో స్టార్ హీరో అజిత్!

“విశ్వంభర” సెట్స్ లో స్టార్ హీరో అజిత్!

Published on May 29, 2024 4:03 PM IST


మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. వచ్చే ఏడాది జనవరి 10 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబందించిన షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. అయితే కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

అయితే హీరో అజిత్ తాజాగా విశ్వంభర సెట్స్ లో అడుగు పెట్టారు. అజిత్ సర్ప్రైజ్ ఎంట్రీ తో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. అయితే మెగాస్టార్ చిరంజీవి తో అజిత్ ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తమ అభిమాన హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడటం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశ్వంభర చిత్రం లో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, అషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు