డార్లింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కి హాలీవుడ్ ఆఫర్

డార్లింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కి హాలీవుడ్ ఆఫర్

Published on Sep 24, 2019 10:41 AM IST

gv prakash

చిత్ర పరిశ్రమలోకి మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రవేశించి హీరోగా మారారు జి వి ప్రకాష్. హీరోగా ఆయన ఇప్పుడు వరుసపెట్టి చిత్రాలు చేస్తున్నారు. ఈయన తెలుగులో ప్రభాస్ నటించిన డార్లింగ్ చిత్రానికి సంగీతం అందిచడం జరిగింది. కాగా ప్రకాష్ ఇప్పుడు ఓ హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ‘డెవిల్‌నైట్‌’ నిర్మాత డెల్‌ గణేశన్‌ తదుపరి నిర్మిస్తున్న ‘ట్రాప్‌ సిటీ’ చిత్రంలో జీవీ ప్రకాశ్‌ హీరోగా నటిస్తున్నారు. రికీ పర్చల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆంగ్ల నటుడు జాన్సన్‌ కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు చిత్రవర్గాలు చెప్పడం జరిగింది.

ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మన్ మేనల్లుడైన ప్రకాష్ ప్రస్తుతం దాదాపు పది చిత్రాలలో నటిస్తూ బిజీ గా ఉన్నారు. 100% కాదల్ అనే చిత్రంలో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని నటిస్తుంది. ఆయ్నగరం, జైల్, ఫోర్ జి ఇలా దాదాపు పలు చిత్రాలలో ప్రకాష్ నటిస్తున్నారు. రజిని కాంత్, జగపతి బాబు కాంబినేషన్ లో వచ్చిన కుచేలన్ చిత్రంలో కేమియో పాత్ర ద్వారా ప్రకాష్ నటుడిగా వెండితెరపై కనిపించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు