యంగ్ హీరో హఠాన్మరణం.

కన్నడ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. హీరో చిరంజీవి సర్జా మరణించారన్న వార్త వారిని షాక్ కి గురిచేసింది. కన్నడలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరిగా ఉన్న చిరంజీవి సర్జా నేడు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు కేవలం 39 సంవత్సరాలు. ఆయన మరణానికి గుండె పోటు కారణం అని తెలుస్తుంది. నేటి మధ్యాహ్నం ఆయనకు గుండె పోటు రావడంతో బెంగుళూరులోని అపోలో హాస్పిటల్ కి తరలించారు.

కాగా చికిత్స జరుగుతుండగా ఆయన తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమను శోక సముదంలోకి నెట్టింది. ఆయన ప్రస్తుతం దాదాపు నాలుగు చిత్రాలలో నటిస్తున్నారు . 20 సినిమాలకు పైగా ఆయన నటించడం జరిగింది. 2017లో నటి మేఘనా రాజ్ ని వివాహం చేసుకున్నారు.

Exit mobile version