గోపీచంద్ తో తేజ సినిమా ఉంటుందట !

gopi cahnd teja

హీరో గోపీచంద్ గత కొన్నేళ్ళుగా సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఆశలతో చేసిన ‘చాణక్య’ కూడా నిరాశపరచడంతో.. గోపీచంద్ పూర్తిగా అయోమయంలో పడిపోయాడు. దాంతో నటుడిగా లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో తనను నిలబెట్టినా దర్శకుడు తేజతో సినిమా చేయడానికి కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు ఫలించాయి. డైరెక్టర్ తేజతో చేసిన ‘జయం, నిజం’ సినిమాలతో ప్రతినాయకుడిగా నిలదొక్కుకున్న గోపీచంద్ ఈ సారి హీరోగా తేజ దర్శకత్వంలో సినిమా చెయ్యబోతున్నాడు.

ఇటు డైరెక్టర్ తేజ సైతం గోపీచంద్‌ తో కలిసి పని చేయడానికి బాగానే ఇంట్రస్ట్ గా ఉన్నాడు. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథ పై చర్చలు జరిగాయని ఫిల్మ్ నగర్ టాక్. గోపీచంద్ కి డైరెక్టర్ తేజ మాస్ జోనర్ లో ఓ లైన్ ను చెప్పారని.. పూర్తిగా పాత్ర బలంతో నడిచే ఆ కథ గోపీచంద్ కి కూడా బాగా నచ్చిందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే సంవత్సరానికి వీరి సినిమా పట్టాలైక్కే అవకాశముంది.

ఇకపోతే గోపిచంద్ ప్రస్తుతం దర్శకుడు సంపత్ నంది డైరెక్షన్ లో సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇందులో తమన్నా కథానాయకిగా నటించనుంది.

Exit mobile version