మొదటిసారి ‘భీమా’ విషయమై అటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన హీరో గోపీచంద్

మొదటిసారి ‘భీమా’ విషయమై అటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన హీరో గోపీచంద్

Published on Mar 3, 2024 12:00 AM IST

GopiChand

గోపీచంద్ హీరోగా ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ భీమా. ఈ మూవీని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ గ్రాండ్ లెవెల్లో నిర్మించగా ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఆకట్టుకున్న భీమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా వరంగల్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి సీతక్క చీఫ్ గెస్ట్ గా విచ్చేసారు. ఈవెంట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ, ఇన్నాళ్లు ఆడియన్స్ తన మీద చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు అని అన్నారు.

ఇక ఇక్కడికి ఎంతో దూరం నుండి నాకోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పారు గోపీచంద్. మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారి వలన భీమా మూవీ రూపొందిందని అన్నారు. నిజానికి ఆయనే దర్శకడు హర్ష ని తనకు పరిచయం చేసారన్నారు. షూటింగ్ లో ప్రతి మోమెంట్ ఎంతో ఎంజాయ్ చేశాను, స్వతహాగా నేను మొదటి నుండి నా సినిమాల విషయమై ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వను. కానీ ఈ సినిమా మాత్రం తప్పకుండా అందరి అంచనాలు అందుకుని పెద్ద సక్సెస్ అవుతుందని పక్కాగా చెప్పగలను అన్నారు గోపీచంద్. ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు, డైరెక్టర్ హర్ష ఈ మూవీ కోసం ఎంతో కష్టపడడం జరిగిందని, అది మీకు రేపు స్క్రీన్ పై కనిపిస్తుందని అన్నారు. కాగా భీమా మూవీ మార్చి 8న ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు