అనుకున్న దానికంటే ఎక్కువ‌గా రీచ్ అయ్యింది – హీరో హ‌ర్షిత్‌

అనుకున్న దానికంటే ఎక్కువ‌గా రీచ్ అయ్యింది – హీరో హ‌ర్షిత్‌

Published on Jul 28, 2019 11:00 PM IST

Harshith

ఓ.య‌స్‌.యం విజన్ – దివ్యాషిక క్రియేష‌న్స్ పతాకాలపై సుక్రి కుమార్ నిర్మించిన సైకలాజికల్ థ్రిల్లర్ నేను లేను… లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉప‌శీర్షిక‌. హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన‌ ఈ చిత్రానికి రామ్ కుమార్ దర్శకత్వం వహించారు. జూలై 26న విడుద‌లైంది. ఈ సందర్భంగా హీరో హ‌ర్షిత్ మీడియాతో మాట్లాడారు.

నేను పుట్టింది క‌ర్నూలు. ప‌ద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కు క‌ర్నూలులోనే చ‌దువుకున్నాను. ఇంట‌ర్మీడియ‌ట్ నుండి హైద‌రాబాద్ వ‌చ్చేశాం. చిన్న‌ప్ప‌టి నుండి న‌ట‌న అంటే ఆస‌క్తి. డ్యాన్స్‌, న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకున్నాను. న‌టుడిగా నాకు హీరో సూర్య‌గారంటే చాలా ఇష్టం. 8 సంత్స‌రాలుగా ద‌ర్శ‌కుడు రామ్‌ కుమార్‌ గారితో అనుబంధం ఉంది. నేను లేను సినిమాలో నా క్యారెక్ట‌ర్ విన‌గానే చాలా కొత్త‌గా అనిపించింది. డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ కావ‌డంతో ఛాలెంజింగ్ ఉంద‌ని భావించి సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకున్నాను. కొత్త కాన్సెప్ట్ సినిమాల‌ను చూడాల‌నుకునేవారికి నేనులేను త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. నేను అనుకున్న దానికంటే సినిమా ఎక్కువ‌గా రీచ్ అయ్యింది.

ఇక నెక్ట్స్ ప్రాజెక్ట్స్ రెండు సినిమాలున్నాయి. ఇంకా ఏవీ క‌మిట్ కాలేదు. హీరోగానే కాదు.. న‌టుడిగా పేరు వ‌చ్చే ఎలాంటి పాత్ర‌నైనా చేయ‌డానికి నేను సిద్ధం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు